బీసీల పక్షపాతి సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నేత గాలి అనిల్ కుమార్
బీఆర్ఎస్ అభ్యర్థులకే మున్నూరు కాపుల మద్దతు
రేపటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన మున్నూరు కాపుల తీర్మానాలు

మెదక్: కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత గాలి అనిల్ కుమార్ ఆరోపించారు. శనివారం స్థానిక పిట్లం బేస్ సంఘ భవనంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌లో వెనకబడిన వర్గాలు గెలవలేక పోతున్నాయి. బీసీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. మున్నూరు కాపులకు సీఎం కేసీఆర్ 10 టికెట్లు ఇచ్చారన్నారు. పనిరాని సర్వేలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగాలు బీసీలపై చేస్తోంది. 40 శాతం బీసీలు ఉన్నప్పుడు మొత్తం 50 శాతం సీట్లు కూడా గెలవలేని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా అధికారంలోకి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం కలేనని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేపటి నుంచి గ్రామగ్రామాన మున్నూరు కాపులు తీర్మానాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బట్టి జగపతి, టీబీవీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్, మెదక్ జిల్లా మున్నూరు కాపు నాయకులు, యువక మండల అధ్యక్షులు భువనగిరి శేఖర్, పూల మల్లేష్, గంగాధర్, పట్టణాధ్యక్షులు గట్టేష్, నాగభూషణం, హర్కార్ మహిపాల్, శివ, శ్రీనివాస్, రాము, వినోద్, రాజు, ఆయా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల పాల్గొన్నారు.



