రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం

- Advertisement -

రోడ్డు ప్రమాదాలు అరికట్టడంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం

Failure of government authorities to prevent road accidents

వలసలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్

నరసరావుపేట,
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీ చెందిన పేదలు పొట్టకూటి కోసం ఉదయాన్నే నరసరావుపేట నుండి చిలకలూరిపేట వైపు మిరపకాయలు కోయటానికి ఆటోలో వెళుతూ ఉండగా కనపర్తి దగ్గరకు వెళ్ళేసరికి అతివేగంగా వస్తున్న ఒక లారీ ఆటోని క్రాస్ చేస్తూ జరిగిన ప్రమాదంలో 18 మంది పేద వలస కూలీలు ప్రమాదానికి గురి అయ్యారు. తదుపరి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం తీసుకురాగా ఒకరికి ఇబ్బందికరంగా ఉందని కొంతమందికి కాళ్లు చేతులు విరగటాన్ని చెప్పిన వైద్యులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ బాధితులను పరామర్శించారు. సంఘటన జరిగిన విషయాలపై జాన్ పాల్ పరిశీలించారు. అనంతరం జాన్ పాల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను అరికట్టడానికి ఏర్పాటుచేసిన ఉపాధి హామీ పథకం నీరు గారి పోవటం, ఆపదకు పేదలకు ఉపయోగపడకటం వలన, వలస కూలీలుగా చుట్టుపక్కల ప్రాంతాలకు పొట్టకూటికోసం ప్రతిరోజు ఉదయాన్నే వందలాదిమంది పేదలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వారికి ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం చెందాయని జాన్ పాల్ అన్నారు.  అలాగే ప్రతిరోజు హైవేలలో యాక్సిడెంట్లు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని, ప్రభుత్వం వలస కూలీలలో అరికట్టటానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, ఇటువంటి ప్రమాదాల వలన కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ప్రభుత్వాన్ని చేశారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షుడు వుస్తేల జయరావు, కొండా ప్రకాష్ తదితరులు వున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular