సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్..
పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. పది తులాల బంగారంతో పరార్…
సికింద్రాబాద్
Fake Doctor at Yashoda Hospital, Secunderabad; Absconds with 10 Tolas of Gold.
యశోద ఆసుపత్రిలో నకీలి వైద్యుల చేతివాటం బయటపడింది..పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వలంటూ రూం లో వచ్చిన యాప్రాన్ వెసుకున్న ఓ మహిళ..వారి కుటుంబీకులందరిని బయటకు పంపి,పేషేంట్ కు స్పృహ లేకుండా చెసి పది తులాల బంగారం తో ఉడాయించింది..దీంతో విషయం గమనించి పేషేంట్ బంధువులు ఆసుపత్రి యజమన్యనికి ఫిర్యాదు చెయగా..వచ్చిందేవరో తమకు తెలియదంటూ స్పష్టం చెయడంతో మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చెశారు..ఓల్డ్ బోయిన్ పల్లి కి చెందిన సుధరాణి అనే మహిళ అనార్యోగంతొ ఆసుపత్రి లో చెరింది.డిశ్చార్జ్ చెసె సమయంలో ..సుధరాణి ఉన్న గదిలోకి ఓ మహిళ యాప్రాన్ వెసుకోని వచ్చింది..పేషేంట్ బంధువులను బయటకు వెళ్ళమంటూ సూచించడంతో వారంత బయటకు వెళ్ళగా..యాప్రాన్ వెసుకోని వచ్చిన మహిళ బయటకు వెళ్ళిన కోద్ది సమయనికి లోపలికి వెళ్ళి చెడగా..సుధరాణి స్పృహ కోల్పోయి ఉంది..వెంటనే యశోద ఆసుపత్రి యజమాన్యం కు ఈ విషయం తెలియజేయగా..తమకు ఎవరు వచ్చారో తెలియదంటూ స్పష్టం చెయడంతో వెంటనే మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చెశారు.అయితే యాప్రాన్ లో వచ్చిన మహిళ,నర్సింగ్ స్టాఫ్ రూం లో వెళ్ళి రావడం,అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉండడం తో తెలిసిన వారి పనా,లేక మరేవరైన వచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చెస్తున్నారు.పది తులాల బంగారం పోయిందంటూ ఫిర్యాదులో పెర్కోన్నారు.



