25.3 C
New York
Saturday, July 13, 2024

ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగాకుటుంబ పాలన

- Advertisement -

ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగాకుటుంబ పాలన
మీ కలలను సాకారం చేయడమే మోడీ సంకల్పం
సంగారెడ్డి సభలో ప్రధాని మోడీ
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటేల్ గూడలో ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ప్రధాని మాట్లాడుతూ దేశంలో కుటుంబ పార్టీలకు చరమగీతం పలకండి. దేశం కోసం పనిచేసే పార్టీ బిజెపి. నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి బిజెపి హ్యాట్రిక్ సాధించబోతోంది.

మోడీ గ్యారెంటీ ఇచ్చారంట కచ్చితంగా అది జరగాల్సిందే జరిగి తీరుతుంది. 17 సీట్లలో బిజెపిని గెలిపించండి. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. మీ యొక్క ప్రేమ మీ ఆశీర్వాదాన్ని మీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోను. ఇది మోదీ గ్యారంటీ. మోడీ గ్యారెంటీ అంటే పూర్తి అయ్యే గ్యారంటీ. మోజీ ఏదైనా చెప్పాడంటే అది చేసి చూపిస్తాడని అన్నారు.
నేను మీకు చెప్పాను మనమందరం కలిసి భారతదేశాన్ని ప్రపంచంలోనే నూతన శిఖరాలను తీసుకొని వెళ్తాను. నేడు మీరు చూస్తున్నారు భారతదేశ నేడు ప్రపంచానికి ఆశా కిరణంగా మారి నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. విదేశాల్లో తెలుగు భాషకు ఉత్తీర్ణతస్థాయి ఉంది విదేశాల్లో తెలుగువారు చాలామంది ఉన్నారు వాళ్ళని చూస్తుంటే గర్వంగా ఉంది.  మిత్రులారా.. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 376 తీసి వేస్తా మన హామీ ఇచ్చాం ఆ హామీని బిజెపి పూర్తి చేసిందా లేదా.. ఆర్టికల్ 376 పై సినిమాలు సైతం వచ్చాయి. అయోధ్యలో భగవంతుడు రామ మందిరాన్ని గౌరవంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించాము. మోదీ గ్యారంటీలు అమలు అయ్యాయా? కాలేవా. ఈరోజు మీకు ఒక గ్యారెంటీ ఇస్తున్నాను.. రాసుకోండి.  రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచానికే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించబోతున్నాను. ఈ గ్యారెంటీ కూడా అమలవుతుంది. ఎందుకంటే ఇది మోదీ గ్యారంటీ. మీకందరికీ తెలుసు దేశానికి తెలుసు మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ.  మిత్రులారా.. మోడీ మీకు మీ కుటుంబానికి ఒక గ్యారెంటీ ఇస్తున్నాడు.. పూర్తి చేయబోతున్నా. కాంగ్రెస్ పార్టీ దాని దాని మిత్రపక్ష పార్టీలు మోడీక, మోడీ పైన విమర్శలు చేయడానికి పరిమితమయ్యారు. ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలుసా మీకు.. వారి యొక్క అవినీతి భాండాగారాన్ని బద్దలు కొడుతున్నాను. ఎవరిపైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదు. జమ్ము కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు ఎక్కడెక్కడ అయితే కుటుంబ పాలన కొనసాగిస్తున్న పార్టీలు ఉన్నాయో అక్కడ పార్ట్ కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయి ప్రజలు దుర్భర స్థితికి చేరుకుంటున్నారని అన్నారు.
కుటుంబ పాలనకు వ్యతిరేకం నేను మాత్రం. వీరి మూలంగా ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది. యువ నాయకత్వానికి కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వడం లేదు. దేశానికి యువ నాయకత్వం ఎంతో అవసరం. తిరిగి మళ్లీ ఏమంటారు అంటే మోడీకి పరివారే లేదంటారు.. మోడీకి కుటుంబమే లేదంటున్నారు. కుటుంబ పార్టీలకు దొంగతనం చేయడానికి లైసెన్సులు లభించాయా. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి 50% కుటుంబ సభ్యులు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. మోడీకి దేశమే మొదటి ప్రధాన్యత వారికి కుటుంబమే మొదటి ప్రాధాన్యత. వారికి వారి కుటుంబమే ముఖ్యం నాకు దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యం. కుటుంబ పార్టీలు వారి కుటుంబం కోసమే పనిచేస్తున్నారు. అవసరమైతే దేశాన్ని బలి చేస్తారు. కుటుంబ పార్టీలు ఎంత అభద్రత ఉన్నాయో తెలుసా.. దేశంలో నిజమైన నాయకత్వాన్ని రాజకీయాల్లో ఇవ్వడం లేదు. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోంది. దేశ ప్రజాస్వామ్యంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాము. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకున్నాయి. నాకు ప్రభుత్వం నుండే వచ్చే జీతాన్ని సైతం ప్రజల కోసం పార్టీ చేశాను. కుటుంబ పార్టీలు తమ నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకున్నారు. నాకు వచ్చే ప్రతి బహుమతిని దేశ కోషాగారానికి అందిస్తున్నాను.. వాటి ద్వారా వచ్చే డబ్బులు గంగ నది ప్రక్షాళనకు అందిస్తున్నానని అన్నారు.
కుటుంబ వాదులు తమ ఖజానా నింపుకుంటూ తమ కుటుంబ సభ్యులను రాజకీయంగా అభివృద్ధి పరుస్తున్నారు. నేను కుటుంబ వాది నైతే నాకు వచ్చే ప్రతి బహుమతి ఇంటికి తీసుకు వెళ్లేవాని.. కానీ నేను దేశ ప్రజల కోసం అందిస్తున్నాను. తమ నల్లదనాన్ని  విదేశాల్లోని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. మోడీ తనకోసం ఇప్పటివరకు ఒక చిన్న గదిని సైతం నిర్మించుకోలేదు. దేశంలోని ప్రతి పేద వాడి కోసం ఇళ్లను నిర్మిస్తున్నాము ఇప్పటివరకు నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం దేశాన్నిపరంగా పెట్టారు. ఓవర్గం తమ కుటుంబాలకు విలాస భవంతులు కట్టించారు. దేశంలోని 140 కోట్ల ప్రజలు మోడీ కుటుంబ సభ్యులు. దేశంలోని ప్రజలందరూ. మోడీ మా కుటుంబ సభ్యుడిని ముక్త కంఠంతో చెబుతున్నారు. మేమందరం మోడీ కుటుంబ సభ్యులం. దేశంలోని ప్రతి చెల్లి ప్రతి తల్లి నా కుటుంబమే.. ఇది ఇండియా కూటమికి అర్థం కావడం లేదు. తెలంగాణ వికాసం కోసం వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. నేడు తెలంగాణ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల మౌలిక వసతుల  కల్పనకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశానని అన్నారు.
మీ కలలను సాకారం చేయడమే మోడీ సంకల్పం. దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల ప్రజలందరూ బిజెపి వెనుకే ఉన్నారు. మేము ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడి సంక్షేమం లక్ష్యంగా అందిస్తున్నాం. దేశంలో నిర్మించిన నాలుగు ఇళ్లలో అధిక శాతం మహిళల పేర్ల పైన ఉన్నాయి. మా పథకాల్లో ఎక్కువ లబ్ధి పొందింది మహిళలే. 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని గత పది ఏళ్లలో చేసి చూపించామన్నారు. పీఎం కిసాన్ సన్మానిధి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు అండగా నిలిచాము. తెలంగాణ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన రక్షక కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. టిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ రెండు కూడా రెండు కూడా ఓకే నాణానికి రెండు ముఖాలు. బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య పటిష్టమైన అవినీతి బంధం ఉంది. తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశం మొత్తం తెలుసు.. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడంలో రెండు పార్టీలు సహకరించుకుంటున్నాయి. కాలేశ్వరం పేరుతో బి ఆర్ ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు దోచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏమి చర్యలు తీసుకోవడం లేదు.. కాంగ్రెస్ పార్టీ మౌనం దేనికి సంకేతం. బిఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం భాగస్వాములయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం గా మార్చుకుంటుంది. ఇది ఎక్కువ రోజులు కొనసాగనివ్వం. నరేంద్ర మోడీ నాయకత్వంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం ఎయిర్  స్ట్రైక్  కూడా చేస్తామని అన్నారు.
ఇందుకోసం మీ సంపూర్ణ మద్దతు లభించాలి మీ ఆశీర్వాదం కావాలి. తెలంగాణ ప్రజలందరూ అప్ కీ బార్ చార్సో బార్ అని నినదిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపికి 400 సీట్లు అందించాలని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!