రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
Farmer welfare is the mission of the alliance government
-ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెల్లింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం, ఉదయం న్యూస్, ఆగస్టు 12,
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏలూరు సి ఆర్ రెడ్డి ఆడిటోరియంలో రైతులకు ధాన్యం బకాయిలను సోమవారం విడుదల చేసిన ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం చేసిన పాపాలకు మూడు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చివరికి కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించాల్సి వచ్చింది అన్నారు. ఈ సందర్భంగా 35,374 మంది రైతులకు 674.47 కోట్ల ధాన్యం బకాయిలను గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ మేరకు పలువురు రైతులకు మంత్రి చేతుల మీదుగా బకాయి చెక్కులను పంపిణీ చేశారు.