- Advertisement -
రైతులకు లాభసాటి సంఘం కృషి
Farmers benefit from community efforts
అమృతభారత్
సంఘ చైర్మన్ కొండపల్లి నగేష్
తాడేపల్లిగూడెం ,అక్టోబర్ 24,
రైతులు తాము పండించిన పంటను దళారుల పాలు చేయకుండా వారి పంటను వారే అమ్ముకునే విధంగా కృషి అమృతభారత్ బాధ్యత తీసుకుంటుందని సంఘ చైర్మన్ కొండపల్లి నగేష్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం అప్పారావుపేట గ్రామాల్లో ప్రభుత్వ అనుమతితో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంఘ డైరెక్టర్ పైడికొండల సింధు మాట్లాడుతూ రైతులకు ఫార్మల్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ పై వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, రైతులు బాలఎం కృష్ణ, తమ్మిశెట్టి సుబ్బారావు, తమ్మిశెట్టి రఘు, గోపిశెట్టి భరతుడు, కవులూరి పరిమళ , కార్యదర్శి బొచ్చు ఫణి కుమార్, సంఘ సీఈవో రఘురామరాజు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -