Monday, December 23, 2024

అన్నదాతలకు అధైర్యం వద్దు

- Advertisement -

అన్నదాతలకు అధైర్యం వద్దు

Farmers don't be impatience

నెల రోజుల్లో అందరికీ రుణమాఫీ

వనపర్తి
పదేళ్ల  బీఆర్ఎస్ పాలనలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నాయకులు కొందరు నేడు రైతుల పక్షాన మొసలి కన్నీరు కారుస్తూ నిరసనలు చేపట్టడం ఆస్యాస్పదమని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  వ్యాఖ్యానించారు. వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ లో గల క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు

అభివృద్ధి అంటూ 7 లక్షల 12 వేల కోట్ల అప్పు చేసి  జేబులు
నింపుకున్నారని, బీఆర్ఎస్పార్టీ చేసిన అప్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 5600 కోట్లు వడ్డీ  చెల్లిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.జిల్లాల అభివృద్ధి ప్రాతిపతగిన అన్ని జిల్లాలలోనూ అభివృద్ధి జరిగిందని అదేవిధంగా వనపర్తి జిల్లాలోనూ ప్రభుత్వ కార్యాలయాలు కళాశాలలో నెలకొల్పబడ్డాయని అంతమాత్రాన అభివృద్ధి మేమే చేశాం అనడం నిద్దురమని ఎమ్మెల్యే విమర్శించారు

కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్మింపబడిన రిజర్వాయర్లు ప్రధాన కాలువలకు చిన్నచిన్న బొక్కలు పెట్టి తామే అభివృద్ధి చేశామనడం గమనార్హం అన్నారు

పాలమూరు ఎత్తిపోతల నుంచి వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా నీరు అందుతుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు

.
రోడ్ల విస్తరణలో  ఇష్టానుసారంగా వ్యవహరించి నిధులు లేకుండానే నిర్మాణాలు చేపట్టామని నిస్సిగ్గుగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 18 వేల ఒక వంద మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు

త్వరలోనే రైతు భరోసా సైతం రైతుల అకౌంట్లో జమవుతుందని ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని ఎమ్మెల్యే అన్నదాతలకు భరోసా కల్పించారు  సమావేశంలో  మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్