Saturday, February 14, 2026

రైతులు ఆందోళన చెందవద్దు ..ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

- Advertisement -

రైతులు ఆందోళన చెందవద్దు ..ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

Farmers don't worry ..don't lose composure

                   రైతులకు అండగా ఉంటాం
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌
అమరావతి సెప్టెంబర్ 6
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ రెండో రోజు శుక్రవారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో పర్యటించారు. బుడమేరు గండ్ల వల్ల పంట నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. రైతులకు అండగా ఉంటాం. ప్రధాని మోదీ ఆదేశాలతో వరద విపత్తును పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు, రైతులతో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, రైతు పక్షపాతిగా అన్నదాతల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. 8,9 రోజులుగా రైతుల పంట పొలాల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. వరి సహా పలు రకాల పంటలు పూర్తిగా నీట మునిగి రైతులు నష్టపోయారని తెలిపారు.సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఈ విపత్తును సీరియస్‌గా తీసుకున్నారని, ఇద్దరూ కూడా రైతులకు అండగా నిలబడతారని, కేంద్ర మంత్రి వెంట మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి, అధికారులు ఉన్నారు. అనంతరం వారు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్