- నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన కేసులు
- మండల వ్యవసాయ అధికారి నాగమణి
కోరుట్ల :జులై 11: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ అధికారి నాగమణి అన్నారు. మండలంలోని పైడిమడుగు, మాదాపూర్ గ్రామలలోని సహకార సంఘాల్లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నాగమణి మాట్లాడుతూ.. వానాకాలం పంటకు అవసరమగు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు మండలంలోని అన్ని దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
రైతులు లైసెన్స్ గల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని సూచించారు. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని, డీలర్స్ ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు చేపట్టాలని నిర్వహకులు సూచించారు. ప్రతిరోజూ తప్పనిసరిగా స్టాక్ బోర్డ్, స్టాక్ రిజిస్టర్ లో రోజు వారి అమ్మకాలు నమోదు చేయాలన్నారు. ఎరువుల నమూనాలు సేకరించి నాణ్యత పరీక్ష నిమిత్తమై హైదరాబాద్ ల్యాబ్ కి పంపినట్లు ఆమె తెలిపారు…..