సొసైటీ సహకార సంఘం రైతులు ఈ కేవైసీ చేసుకోవాలి.
Farmers of society cooperative society should do this KYC.
శిరివెళ్ల
బోయలకుంట్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ఖాతాదారుల రికార్డులు పరిశీలించిన పర్సన్ ఇంచార్జ్
శిరివెళ్ల
:- మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలలో అకౌంట్లు (సొసైటీ ఖాతాలు) కలిగినటువంటి రైతన్నలు ఈకేవైసీ చేసుకోవాలని శిరివెళ్ల కేడీసీసీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మరియు పర్సన్ ఇన్చార్జి రేణుక పిలుపునిచ్చారు.మండల పరిధిలోని బోయలకుంట్ల గ్రామంలో గల సహకార సంఘ సొసైటీ ఖాతాదారుల యొక్క రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా బోయలకుంట్ల, చెన్నూరు, ఇసుక పల్లె, గంగవరం, మోత్కుల పల్లె, గుండంపాడు, మహాదేవపురం తదితర గ్రామాల రైతుల యొక్క బోయలకుంట్ల సొసైటి పరిధిలోని పలు ఖాతాలను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా పర్సన్ ఇన్చార్జి మాట్లాడుతూ సొసైటీలో సభ్యత్వం ఖాతాలు ఉన్నటువంటి వివరాలు ఆయా గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం బదిలీ చేసిందని సూచించారు. ఈ సందర్భంగా సచివాలయాలలో ఓటీపీల ద్వారా గాని నేరుగా వెళ్లి గానీ ఈకేవైసీని చేపించుకోవాలన్నారు. ఈ కేవైసీ చేసుకోవడం వల్ల ప్రభుత్వ రాయితీలు లభిస్తాయని ఆయా సొసైటీలలో ఓటు హక్కు కలిగి ఉంటారని ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ మరియు పర్సన్ ఇన్చార్జి రేణుక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సుబ్బరాయుడు,సొసైటీ సీఈవో కానాల దస్తగిరి సిబ్బంది పాల్గొన్నారు.