- Advertisement -
రైతు పండగకు రైతులను తరలించాలి
Farmers should be moved to Rythu Festival
గద్వాల జోగులాంబ
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించే రైతు పండగ, రైతు అవగాహన కార్యక్రమాలకు జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 29, 30 తేదీలలో రైతు అవగాహన, రైతు పండుగ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఇందులో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలకు సంబంధించి వ్యవసాయ రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, యాంత్రికరణ, విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు అన్నింటిపై రైతులకు శిక్షణతో పాటు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సైంటిస్టులు, వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. ఇందుకు గాను జిల్లాలోని అన్ని మండలాల్లో గల రైతు క్లస్టర్ల నుండి రైతులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎంపీడీవోలు, వ్యవసాయ అధికారులు, ఏపిఎం లు తమతమ మండలాలలోని క్లస్టర్ల వారిగా రైతుల జాబితాను సిద్ధం చేసి సకాలంలో కార్యక్రమానికి చేరుకునే విధంగా వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, భోజన సదుపాయాలను కల్పిస్తూ సురక్షితంగా సభకు తరలించాలని అన్నారు. రైతులను తరలించేందుకు ఆర్టీసీ విభాగం వారు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, మండల స్థాయి వ్యవసాయ అధికారులు, ఏపీఎం లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -