Sunday, April 13, 2025

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది

- Advertisement -

దేశంలోనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే

Farmers were treated unfairly during the regime of TRS government

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగింది
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన  పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి
దేశంలోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర లేదని, ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారు అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు. గత ఏడాది వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు రుణమాఫీ చేసేందుకు ఎంతగానో శ్రమించారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడుదల వేసిన డబ్బులు వడ్డీలకే సరిపోయాయని అన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలు సమీపించే సమయంలో కొంతమందికే రుణమాఫీ చేశారని అనేక మంది రైతులకు రుణమాఫీ చేయలేదని దీంతో రైతులు అప్పుల పాలయ్యారని విమర్శించారు. రైతుబంధు ఒకటే సర్వరోగ నివారిణి అని భావించిన గత ప్రభుత్వం రుణమాఫీ సక్రమంగా చేయలేదని, ఇతర పథకాలను కొనసాగించలేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల వల్ల పంటలు నష్టపోతే రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదన్నారు. 2019 నుంచి ఈ పథకం రాష్ట్రంలో అమల్లో లేకుండా పోయిందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది యాసంగి సీజన్లో పెద్దపల్లి జిల్లాలో కురిసిన వర్షాలకు అనేక మంది రైతులు పంట నష్టపోయారని కేవలం 6 కోట్ల 90 లక్షల రూపాయలు మాత్రమే పరిహారాన్ని అందజేసి, మిగతా రైతులకు రావాల్సిన 21 కోట్ల  వేల రూపాయల పరిహారాన్ని అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మేటలు వేసిన పంటలకు కూడా ఒక రూపాయి ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పథకం అయ్యేదా అని ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి లు విమర్శలు చేస్తున్నాయని, అది సరైంది కాదని చెప్పారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా డిసెంబర్ 9 నాటికి తీసుకున్న రుణాలపై వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రకటించినదని వివరించారు. అయితే మొత్తానికి వడ్డీ చెల్లించడం లేదని ప్రతిపక్ష నేతలు అవగాహన రాహిత్యంలో మాట్లాడడం సరైనది కాదని హితవు పలికారు. పంటల సాగు విషయంలో టిఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు రైతులను ఇబ్బందులకు గురి చేశాయని పేర్కొన్నారు. దొడ్డు బియ్యం తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం చెబితే, సన్న వడ్లు మాత్రమే పండించాలని, పత్తి పంట వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి రైతులను అయోమయానికి గురిచేశాయని అన్నారు. రైతులకు మంచి చేస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా ఆశీర్వదిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతుల్లో ప్రగాఢమైన విశ్వాసం నెలకొందని చెప్పారు. రుణమాఫీ విషయంలో ఎక్కడైనా అవంతరాలు తలెత్తితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సవరించి సదరు రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎమ్మెల్యే విజయరమణ రావు మరొకసారి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్