మున్నేరు ప్రవాహ ప్రాంత ప్రజల్లో భయం భయం

- Advertisement -

మున్నేరు ప్రవాహ ప్రాంత ప్రజల్లో భయం భయం

Fear grips people in flood-hit areas

జగ్గయ్యపేట
మున్నేరుకు గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం తో స్థానిక ప్రజలు భయాందోళనలో వున్నారు.  వత్సవాయి మండలం పోలంపల్లి డ్యామ్ వద్ద 13 అడుగుల మేర  వరద ప్రవాహం ప్రవహిస్తోంది.  మరో రెండు అడుగులు వరద ప్రవాహం పెరిగితే పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహించే అవకాశం వుంది. దాంతో  రాత్రికి రాత్రే అధికారులు  అప్రమత్తం ముప్పు ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.  శనివారం న్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.  ఎగువున కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో మున్నేరు ప్రవాహ ప్రాంత ప్రజలు ను అధికారులు అప్రమత్తం చేశారు.  వత్సవాయి మండలం పెనుగంచిప్రోలు మండలం నందిగామ మండలంలోని పలు గ్రామాలు లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు .  ఖమ్మంలో కురుస్తున్న వర్షం కు అక్కడి అధికారులు అప్రమత్తం అవడంతో ఇక్కడ అధికారులు ముందస్తుగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గత వారం రోజుల క్రితమే వరద ఉధృతి పెరిగి తగ్గడంతో మరోసారి వరదరావడంతో ప్రజలు భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular