Sunday, September 8, 2024

శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు

- Advertisement -

శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు

1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది.

2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.

3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.

4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది.

5. మందిరంలో ఐదు మండపాలు (హాల్) – నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉన్నాయి.

6. మందిరంలోని స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు.

7. మందిరానికి తూర్పు వైపు సింహ ద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లాలి.

8. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు లిఫ్టుల ఏర్పాటు ఉంది.

9. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ (దీర్ఘచతురస్రాకారంలో) నిర్మాణం చేయబడింది.

10. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి.

11. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది.

12. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరీ మాత, దేవి అహల్య మందిరాలున్నాయి.

13. కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో, కుబేర్ తిలా వద్ద, శివుని పురాతన మందిరం, జటాయువు విగ్రహంతోపాటుగా పునరుద్ధరించబడింది.

14. మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు.

15. మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించబడింది, ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది.

16. నేల తేమ నుండి రక్షణ కోసం, గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది.

17. మందిర్ కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి, అగ్ని ప్రమాదాల నివారణ కోసం నీటి సరఫరా, ప్రత్యేకమైన విద్యుత్ కేంద్రం ఉన్నాయి.

18. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం (PFC) నిర్మాణంలో ఉంది. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు & లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు.

19. కాంప్లెక్స్‌లో స్నానపు గదులు, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది.

20. మందిర్ పూర్తిగా భారత్ దేశ సాంప్రదాయ పద్ధతిలో, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా.. పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం జరుగుతోంది.

జై శ్రీరామ్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్