ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా సీఐ, మహిళా ఎస్ఐ
వికారాబాద్
Female CI and SI Caught Accepting Bribe at Women’s Police Station
ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి సీఐ, ఎస్ఐ అధికారిణులు లంచం
డిమాండ్ చేసారు. ఇర్షాద్ కుటుంబసభ్యులకు ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేసారు. రూ.40,000
లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగి, రూ.20,000 సీఐకి, ఎస్ఐకి బాధితుడు ఇచ్చాడు. మిగతా రూ.20,000 విషయంలో బాధితుడు ఇర్షాద్ సమాచారం ఇవ్వడంతో సీఐ సరోజ, ఎస్ఐ రాణితో సహా మరో
ముగ్గురిని అధికారులు ఆధారాలతో పట్టుకున్నారు.



