క్షేత్రస్థాయి పర్యటన భవిష్యత్ లో ఉపయోగపడుతుంది
Field trip will be useful in futureజిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి,
కేంద్ర ప్రభుత్వ సెక్షన్ అధికారులు ప్రభుత్వ పథకాల అమలుపై గ్రామస్థాయి పర్యటన ఉద్యోగ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
జిల్లాకు 10 రోజుల పర్యటకు విచ్చేసిన ఆరుగురు సభ్యులు గల కేంద్ర సెక్షన్ అధికారుల బృందం కాటారం, రేగొండ మండలాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, పార్కులు, డంపింగ్ యార్డులు తదితర పధకాలను పరిశీలించామని తెలిపారు. పర్యటన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఐడిఓసి కార్యాలయంలో సెక్షన్ అధికారులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుత గత నెల 26 వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు అధికారులు జిల్లాలోని కాటారం మండలంలోని గంగారం, నస్తూరు పల్లి, రేగొండ మండలంలోని రంగయ్య పల్లి, నారాయణపూర్ గ్రామాల్లో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి పర్యటనలో గమనించిన అంశాలు, పర్యటన ఎలా ఉంది, ఏమేమి అంశాలు గమనించారని అడిగి తెలుసుకుని వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కేజిబివి పాఠశాల్లో విద్యార్థులతో భోజనం చేశామని బావుందని తెలిపారు. మారుమూల గ్రామలున్న మన జిల్లాలో కేంద్ర అధికారుల బృందం పర్యటించి ప్రజల జీవన స్థితిగతులు, ఆర్ధిక అంశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడం జరిగిందని తెలిపారు.
72 శాతం అటవీ భూములున్న ఈ జిల్లాలో పంటల సాగు, ప్రభుత్వ పథకాలపై పరిశీలనపై అవగాహన పొందడం ఉద్యోగి భావి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం జిల్లాకు పర్యటనకు రావడం చాలా సంతోషమని తెలిపారు. డంపింగ్ యార్డులు గ్రామాలకు దూరంగా ఉన్నాయని, దాని వల్ల వ్యర్దాలు సేకరణలు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని గమనించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమి లభించని కారణంగా గ్రామాలకు దూరంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారుల బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. జిల్లా పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కలిగిందని, జిల్లా యంత్రాంగం సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి పర్యటనలో ప్రజలు పథకాల గురించి తెలిపారని అధికారుల బృందం తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిపిఓ నారాయణ రావు, ఆర్డిఓ మంగిలాల్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




