Wednesday, February 25, 2026

డీలిమిటేషన్ పై పోరాటం

- Advertisement -

డీలిమిటేషన్ పై పోరాటం
న్యూఢిల్లీ, మార్చి 13, (వాయిస్ టుడే)

Fight over delimitation

భారత దేశంలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన ఉద్యానికి మద్దతు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర పూరితంగానే దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు కదలాలని పిలుపునిచ్చారు. మార్చి 22న జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ప్రతినిధుల బృందం ఆయా సీఎంలతో సమావేశమై ప్రత్యేకంగా ఆహ్వానించనుంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త‌మిళ‌నాడు మంత్రి టి.కె.నెహ్రూ ఆధ్వ‌ర్యంలోని డీఎంకే ప్ర‌తినిధి బృందం ఢిల్లీలో క‌లిశారు. త‌మిళ‌నాడు సీఎం త‌ర‌ఫున సభకు ఆహ్వానించారు. నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు జరిగే న‌ష్టంపై చర్చించారు. దీనిపైనే చర్చించేందుకు 22న జరిగే దక్షిణాదిలోని కీలక నేతలను ఆహ్వానిస్తున్నట్టు డీఎంకే బృందం తెలిపింది.డీఎంకే ప్రతినిధులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బీజేపీకి ప్రాధాన్యత ఉండటం లేదని అన్నారు. అందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది డీలిమిటేషన్ కాదని… దక్షిణాది పరిధి తగ్గించే ప్రయత్నమని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు చెన్నైలో స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న సమావేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం అనుమతి తీసుకొని వెళ్లే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే” బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టేది డీలిమిటేషన్ కాదు. దక్షిణాది పరిధిని కుదించడమే. దీన్ని మేం అంగీకరించబోం. నార్త్‌తో పోలిస్తే మేం చాలా పన్నులు కడుతున్నాం. చాలా కంపెనీలు ఉన్నాయి. ఆంత్రపెన్యూర్లు కూడా అక్కడే ఎక్కువ ఉన్నారు. అందుకే దక్షిణాదికి వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు చేస్తోంది. అక్కడ బీజేపీ విస్తరణకు అవకాశం ఇవ్వడం లేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటక తెలంగాణలో వాళ్లు అధికారంలో లేరు. రాలేరు. అందుకే దీన్ని సెటిల్ చేయడానికి ఇప్పుడు డీలిమిటేషన్ అంటూ కుట్ర చేస్తున్నారు. ” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు అందర్నీ ఏకం చేయడం అవసరం. అందులో భాగంగా స్టాలిన్ ఏర్పాటు చేసిన మీటింగ్‌ను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి కీలకమైన మీటింగ్‌కు హాజరవ్వాలని కాంగ్రెస్ ప్రాథమికంగా అంగీకరించింది అన్నారు. కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకొని అధికారికంగా ప్రకటన చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో దీనిపై చర్చించాలని నిర్ణయించామన్నారు రేవంత్ రెడ్డి. అందుకే అన్ని పార్టీలను ఆహ్వానించి అఖిలపక్షం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. స్టాలిన్ ఏర్పాటు చేసే మీటింగ్‌కు వెళ్లే లోపు తెలంగాణలో అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. ఈ సమస్య ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదన్నారు. దక్షిణాదిలో ఉండే ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రక్రియని అందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ ఇష్యూ పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సమస్యగా అభివర్ణించారు. అందుకే పార్టీలకు అతీతంగా అందర్నీ ఆహ్వానిస్తామన్నారు రేవంత్. దక్షిణాదిలో ఉన్న బీజేపీ నేతలను కూడా పిలుస్తామన్నారు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్‌ కిషన్‌ రెడ్డిని కూడా ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి జానారెడ్డికి చెప్పినట్టు సీఎం తెలిపారు. ఆయన కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తాలని సూచించారు. మార్చి 22న జరిగే మీటింగ్ తర్వాత పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని రేవంత్ తెలిపారు. దీనికి నాయకత్వం వహిస్తున్న స్టాలిన్‌ను ప్రోత్సహిద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.
నిర్మలమ్మను చూసి నేర్చుకోండి
బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి‌. పంటలు ఎండిపోయినా, ప్రజల ప్రాణాలు పోతున్నా బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. పలు అంశాలపై మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నామని గుర్తు చేశారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి ఒకేసారి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌ల‌కు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చామన్నారు. చాలామందికి డీసీసీ అధ్యక్షులందరికీ పదవులు ఇచ్చిన విషయాన్ని వివరించారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్న ఆయన, తాను ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు.కేంద్ర కేబినెట్‌లో ఉన్న ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని మనసులోని మాట బయపెట్టారు సీఎం. కానీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేస్తామన్నారు సీఎం. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఏప్రిల్లో మూడు రోజులపాటు భారత్ సమ్మిట్ నిర్వహించాలని అనుకుంటున్నాము.ఏప్రిల్‌లో మూడు రోజులపాటు తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించాలని అనుకుంటున్నామని తెలిపారు సీఎం. దీనికి 60 దేశాల నుంచి అతిథులను ఆహ్వానించామని, అందుకు విదేశాంగ శాఖ మంత్రి అనుమతి కావాలన్నారు. అందుకోసమే విదేశాంగ శాఖ మంత్రిని కలిసినట్టు తెలిపారు.ఈనెల 22న చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి తమను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు సీఎం. డీలిమిటేషన్ కారణంగా జరిగే నష్టం, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించడానికి రమ్మని అడిగారని గుర్తు చేశారు. పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత ఆ సమావేశానికి హాజరవుతామన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.తమిళనాడుకు వెళ్లేలో‌పు తెలంగాణలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన విషయమన్నారు. త్రీ భాషా విధానంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానన్నారు సీఎం రేవంత్. దీనికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో అందరి అభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత డీఎంకే మీటింగ్ మా వైఖరి చెబుతామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్