ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు’ మూవీ షూటింగ్ పూర్తి

- Advertisement -

ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు’ మూవీ షూటింగ్ పూర్తి

Filming of the movie ‘Prema Diary’s Last Pages’ has been completed.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ స్క్రీన్‌పైకి ఓ బ్యూటీఫుల్ మూవీ రాబోతోంది. పి.వి. అర్జున్ యాదవ్ – అదితి జంట‌గా, శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మాణంలో, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది.
ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ సంగీత ప్రియులను అలరిస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. పాటలకు వస్తున్న ఈ అద్భుతమైన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఈ సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా గ్రాండ్‌గా పరిచయం అవుతున్నారు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, ఆయన నటన ప్రేక్షకులను ఎమోషనల్ జర్నీకి గురిచేస్తాయి. లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ కథలో అర్జున్ యాదవ్ తన నటనతో, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నాడు. మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో పరిణతి ఉన్న నటుడిగా, ఒక వైపు లవర్ బాయ్‌గా.. మరోవైపు ఎమోషనల్ సీన్స్‌లో జీవించేసి చిత్రానికి మెయిన్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఆయనకు హీరోగా మంచి బ్రేక్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ యాదవ్ సరసన హీరోయిన్‌గా అదితి నటించగా, వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.
మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదలైన లిరికల్ సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సినిమా ప్రమోషన్స్‌కు భారీ మైలేజ్ తెచ్చిపెట్టాయి. ప్రేమ, భావోద్వేగాలు, మరిచిపోలేని జ్ఞాపకాల సమాహారంగా దర్శకుడు హరికృష్ణ పామంజి ఈ చిత్రాన్ని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ క్లైమాక్స్ వరకు కదలకుండా కూర్చోబెట్టేలా ఈ ‘చివరి పేజీలు’ సాగుతాయని చిత్ర‌యూనిట్ చెబుతోంది.
తేజ అందించిన సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా, రిచ్‌గా చూపించబోతోంది. హృదయాలను హత్తుకునే ఓ అందమైన ప్రేమ ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు’ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.
నటీనటులు: పి.వి. అర్జున్ యాదవ్, అదితి తదితరులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular