- Advertisement -
క్యాన్సర్ పేషంట్ కు ఆర్ధిక సహాయం
Financial assistance to cancer patients
హైదరాబాద్
అధైర్యపడకుండా సరైన వైద్యం తీసుకుంటే ఏలాంటి క్యాన్సర్ నైనా జయించవచ్చని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అంబర్పేట్ వెంకట్ రెడ్డి నగర్ కు చెందిన కిరణ్మయి గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ,ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.అది గమనించి డిడి కాలానికి చెందిన భారతి చంద్రశేఖర్ ఎస్ సి ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు లక్షల ఆర్థిక సహాయం అందించి వైద్యం చేయించారు.క్యాన్సర్ వచ్చింది అని భయపడకుండా ధైర్యంతో ఉండి సరైన వైద్యం తీసుకున్నట్లయితే జయించవచ్చని, మీకు, మీ చుట్టుపక్కల ఎవరికైనా క్యాన్సర్ వచ్చినట్లయితే వారికి ధైర్యం చెప్పి తోచిన ఆర్థిక సహాయం అందించాలి అని పేషంట్ కిరణ్మయి కోరారు. నాకు ఆర్థిక సహాయం అందించిన భారతి చంద్రశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వస్తే చనిపోతారు అని సరైన వైద్యం తీసుకోకుండా ఉంటారు.అదితప్పు కిరణ్మయి క్యాన్సర్ వచ్చింది అని గమనించి సరైన వైద్యం తీసుకున్నారు.ఈ క్యాన్సర్ వాళ్ళ తల్లికి కూడా ఉంది ఆమె సరైన వైద్యం తీసుకొని ఈరోజు తన కూతురిని ఆమె తీసుకొచ్చి వైద్యం చేయిస్తూ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు.
- Advertisement -