- Advertisement -
జన సైనికుని కుటుంబానికి ఆర్థిక సాయం
Financial assistance to Jana Sainik's family
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 26,
ఆరుగొలను లో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జనసైనికుడు గంటా సత్తిపండు కుటుంబానికి, తెలుగు దేశం పార్టీ కార్యకర్త వీరమల్లు బాలాజీ కుటుంబాలకు జనసేన పార్టీ తరపున గురువారం ఆర్థిక సాయం అందించారు. గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ వంతు ఆర్థిక సహాయంగా ₹ 42000, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన వంతుగా 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మొత్తం డబ్బులు ₹. 52000 రూపాయలను ఈరోజు ఉదయం మన జనసేన పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 26000 రూపాయలు చొప్పున వారి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
బాలిక చికిత్సకు సాయం
ఆరుగొలను
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి చదువుతున్న గుండెపల్లి మధుప్రియ అనే విద్యార్థిని మెదడుకు సంబంధించి అనారోగ్యంతో శస్త్ర చికిత్స నిమిత్తం ₹14 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలియజేసి ఉన్నారు. దినసరి కూలి పై ఆధారపడిన తల్లితండ్రులు కుమార్తె శస్త్ర చికిత్స నిమిత్తం అగు ఖర్చును విరాళాలుగా అభ్యర్థించియున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరుగొలను విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది 58 వేల రూపాయలు విరాళంగా సేకరించి పాఠశాల విద్యా కమిటీకి అందించారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ కె రవి, కమిటీ సభ్యులు ప్రభాకర్, గ్రామ పెద్దలు యు వి సత్యనారాయణ (రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ ), అడపా శ్రీనివాస్ { పెద్దరాజు}తదితరులు పాల్గొని పాఠశాల విద్యార్థులను,ఉపాధ్యాయులను అభినందించినారు.
- Advertisement -



