- Advertisement -
ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి రైలును నిలిపివేయగా ప్రయాణికులంతా బయటకు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -



