గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో ఉన్న సూర్యా ఫ్యాన్సీలో అగ్ని ప్రమాదం
తిరుపతి
Fire in Surya Fancy
గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది, ఈ అగ్ని ప్రమాదాన్ని గల కారణాలు తెలియాల్సి ఉంది, షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్యాన్సి షాపులో మొదలైన అగ్ని మూడో అంతస్తు వరకు వ్యాపించి పొగలు వస్తుండటం తో చుట్టుపక్కల ప్రజలు భయాందోళన గురయ్యారు, కుమ్మర వీధిలో అనేక నివాస,వ్యాపార సముదాయాలు అక్రమంగా నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు అగ్ని ప్రమాదం లాంటి సంఘటన సంభవించినప్పుడు తక్షణం స్పందించే అగ్నిమాపక సిబ్బంది,ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో అవకాశం కూడా లేకుండా ఉంది, ఏదైనా జరగరానిది జరిగితే ప్రాణాపాయం అధికంగా సంభవించే అవకాశం ఉన్నందున అక్రమ కట్టడాలు అలాగే అనుమతులు లేని వ్యాపారాలపై మున్సిపల్ అధికారులు ఇతర శాఖల అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు… గతంలో సూర్య ఫ్యాన్సీ పక్కనే ఓ నివాస సముదాయంలో ఇలాగే మంటలు చెల్లరేయడంతో భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా భయాందోళన గురయ్యారు ఈ నివాస సముదాయం నిర్మాణం లో యాజమాన్యం అనేక అవకతవకలకు పాల్పడిందని ఆ సమయంలో ఇంట్లోనే వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరా వృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు