బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” సినిమా ఫస్ట్ లుక్

- Advertisement -

బ్రహ్మాజీ ఆవిష్కరించిన “యువర్స్ బాబీ” సినిమా ఫస్ట్ లుక్

First look of the film “Yours Bobby” unveiled by Brahmaji

జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత మల్కాజిగిరి  రవికుమార్ తెరకెక్కించిన లవ్ ఎంటర్ టైనర్ ” యువర్స్ బాబీ ‘. పోస్టు  ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ నేడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ మాట్లాడుతూ”యువర్స్  బాబీ సినిమా నేటి యువతను ఆకట్టుకునే కథనంతో, డిఫరెంట్ సంగీతంతో ముందుకు సాగుతుంది. అలాగే సంగీతం మా చిత్రానికి  గొప్ప ఎస్సెట్ కానుంది .. అలాగే ఈ చిత్రంలోని పాటలు కులుమనాలిలో 15 రోజులపాటు చిత్రీకరించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న మా చిత్రానికి విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నాం” అని అన్నారు . సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్, ప్రాచీ థాకర్,
రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్ ,రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, సురేఖ వాణి, రూప లక్ష్మి, బేబీ జెనీషా తదితరులు నటించిన ఈ చిత్రానికి డిఓపి: సూర్య ప్రకాష్ పిండి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: విజయ్ కూరాకుల ,
సంభాషణలు: వై సురేష్ కుమార్,
గీత రచయితలు :రామ్ జోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, కాసర్ల శ్యామ్ వరికుప్పల యాదగిరి, సనారే
సింగర్స్ :రాహుల్ సిప్లిగంజ్ , శ్రీరామ్ చంద్ర, శ్రీకృష్ణ ,రేవంత్, సమీరా భరద్వాజ్ ,రమ్య బెహరా, వాగ్దేవి, సాహితీ, కీర్తన శర్మ,   కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి ,  కపిల్ మాస్టర్,

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular