రాష్ట్ర స్ధాయి పాటల పోటీల్లో జగిత్యాలకు మొదటి బహుమతి
ఓటరు అవగాహన బృందానికి ప్రశంస పత్రాలు
జగిత్యాల,
14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా ఓటర్ అవగాహనా బృందం అధికారులకు రాష్ట్ర స్థాయి పాటల పోటీలలో, స్కిట్ కంపిటేషన్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి లభించిందని జిల్లా నోడల్ అధికారి దేవేందర్ రెడ్డి తెలిపారు.పోటీల్లో గెలుపొందిన కళాకారులు, అధికారులు రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా బోగే అశోక్ (కళాకారుడు), మెప్మా ఏ ఓ శ్రీనివాస్ గౌడ్, కొడిమ్యాల కస్తూరిబా విద్యార్థినులకు, జిల్లా నోడల్ అధికారి దేవేందర్ రెడ్డిలు ప్రశంషా పత్రాలు అందుకున్నారు.
కాలేజీ అంబాసిడర్ లు నితిన్, మహోదయ్ , మాధవి,కస్తూరి బాలికల పాఠశాల ఉపాధ్యాయిని లింగవ్వ , విద్యార్థినిలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నోడల్ అధికారి దేవేందర్,మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ ఓటరు అవగాహనా కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషా కు ధన్యవాదాలు తెలియజేశారు
========================


