‘అలియాస్ రుక్మిణీ’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

- Advertisement -

‘అలియాస్ రుక్మిణీ’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

First schedule of the movie ‘Alias ​​Rukmini’ completed.
‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరో నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో  వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.
‘అలియాస్ రుక్మిణి’ 10 రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్‌లో హీరో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు పాల్గొన్నారు.
యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పకుడిగా వ్యవహరించడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. లైట్ హార్ట్ హాస్యంతో కూడిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో నితిన్ చాలా యూనిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.
తారాగణం: నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular