Wednesday, April 22, 2026

కాంగ్రెస్‌ పార్టీలో ఎగిసిపడుతున్నాయి అసంతృప్తి జ్వాలలు

- Advertisement -

మహబూబ్‌నగర్‌ అక్టోబర్ : కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్లు అమ్ముకున్నావని ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు మరింత రెచ్చిపోయారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం పై దాడి చేసి పీసీసీ అధ్యక్షుడు చాంబర్లు ధ్వంసం చేశారు.దేవరకద్ర కాంగ్రెస్ టికెట్‌ను బీసీ నేత ప్రదీప్ గౌడ్‌ను కాదని మధుసూదన్ రెడ్డికి ఇవ్వడంతో ఆగ్రహం చెందినా ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో హంగామా సృష్టించారు. తనకు టికెట్ ఇవ్వకుండా తీవ్రంగా అవమానించిన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవరకద్ర టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఏం చేయాలో కార్యకర్తలే నిర్ణయిస్తారని ప్రకటించి బయటికి వెళ్లారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన మద్దతు దారులు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులోకి చొరబడి కుర్చీలను, బ్యానర్ల చించి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కుర్చీలు అన్నింటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ కార్యాలయం ఆవరణ మొత్తం పీకి పందిరి వేశారు. తమ  నేతకు టికెట్ ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని శపథం చేశారు.

flames-of-dissatisfaction-are-rising-in-the-congress-party
flames-of-dissatisfaction-are-rising-in-the-congress-party
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్