Sunday, September 8, 2024

ఈసీకి ఫిర్యాదుల వెల్లువ..

- Advertisement -

అధికారులపై కంప్లయింట్స్

Flood of complaints to EC..
Flood of complaints to EC..

హైదరాబాద్ అక్టోబరు 13:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబరు 30న పోలింగ్, డిసెంబరు 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ 4 నాలుగు స్థానాలకు తప్పా మిగిలిన అన్నింటికి అభ్యర్థులను ప్రకటించారు. అధికార పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం ముగించేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలపై వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. జనగామ కలెక్టర్ శివలింగయ్యపై ప్రతిపక్ష నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, సీపీఎం, వైఎస్సాఆర్​టీపీతో పాటు ఇతర నాయకులు ఫిర్యాదు​చేశారు. మరో ఇద్దరు కలెక్టర్లపైనా ఆన్​లైన్​లో కంప్లైంట్స్​ అందాయి. అధికార బీఆర్‌ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ కే.సురేష్‌ కుమార్‌ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. సురేష్‌ కుమార్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సన్మానించి ఫొటోలు దిగిన తీరును ఫిర్యాదుకు జత చేశారు. జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.డీజీపీ అంజనీ కుమార్​పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ఉన్నతాధికారులపై ఊహించని స్థాయిలో  ఫిర్యాదులు చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై వేటు వేసింది. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఆ అధికారి మాకొద్దంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని లేఖలు ఇస్తున్నారు. సీఈఓను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా ఈసీకి కూడా డైరెక్ట్​ మెయిల్స్​ పంపుతున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు, ఎస్పీలు, కిందిస్థాయి ఆఫీసర్లపై భారీగా ఫిర్యాదులు చేశారు. ఈసీ సడెన్​గా ఇరవై మంది అధికారులను బదిలీ చేయడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్ రాజీవ్​ కుమార్​తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం టీమ్​ రాష్ట్రంలో పర్యటించింది. అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశమైంది. బీఆర్​ఎస్ పార్టీ మినహా కాంగ్రెస్, బీజేపీ మిగతా అన్ని పొలిటికల్​ పార్టీలు రాష్ట్ర అధికార యంత్రాంగంపై ఫిర్యాదులు చేశాయి. గులాబీ పార్టీకి అనుకూలంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారని, డబ్బు, మద్యం పంపిణీని గత ఉప ఎన్నికల్లో నివారించలేకపోయారని ఫిర్యా దు చేశాయి. పార్టీల నేతలు, ఇతరులు ఈ–మెయిల్స్​ ద్వారా అధికారులపై ఈసీకి ఫిర్యాదులు పంపారు.తెలంగాణలో కొందరు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరు అధికారులు కాంగ్రెస్ అభిమానులను, కార్యకర్తలను వేధిస్తున్నారని అటువంటి వారికి మిత్తితో  సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పలువురు అధికారులు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ డీజీపీని తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్ పార్టీ అభిమానులను బెదిరిస్తున్నారని , నిఘా పెడుతున్నారని ఆరోపించారు. అరవింద్ కుమార్, జయేష్ రంజన్ లాంటి అధికారులు వ్యాపారులను బీఆర్ఎస్ కు చందాలు ఇమ్మంటూ బెదిరిస్తున్నారని అన్నారు.

Flood of complaints to EC..
Flood of complaints to EC..
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్