కేసీఆర్ కి పంట పొలాలలో పుష్పాభిషేకం
ముందస్తుగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ముఖరా కె గ్రామస్తులు
హైదరాబాద్
Flower garlanding for KCR in crop fields
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తు గా జరుపుకున్నారు, పంట పొలాలో కేసీఆర్ ఫోటో కి పుష్పాభిషేకం చేస్తూ, మళ్ళీ పల్లెలో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారె రావాలి మళ్ళీ కారే కావాలి ,మళ్ళీ రైతు రాజు కావాలంటే మళ్ళీ తెలంగాణ కు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి రంగంలో అభివృద్ధి జరిగింది అని, కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ, బాజా భజంత్రిలు డప్పులు వాయిస్తూ పంట పొలాలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు, కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అని, మళ్ళీ తెలంగాణ లో అభివృద్ధి జర్గాలంటే, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ కేసీఆరే రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, ప్రలాద్, దత్త, శ్రీరామ్ మరియు మహిళలు రైతులు పాల్గొన్నారు