Sunday, October 27, 2024

హైదరాబాద్ లో భారీగా ఫ్లూ కేసులు

- Advertisement -

హైదరాబాద్ లో భారీగా ఫ్లూ కేసులు

Flu cases are high in Hyderabad :

హైదరాబాద్, జూలై 11,
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా వైరల్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా రోజుకు సగటున 600 నుంచి 800 వైరల్ ప్లూ మరియు సీజనల్ కేసులు హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. ఎక్కువ శాతం జ్వరం,జలుబు మరియు దగ్గు సమస్యలతో బాధపడుతున్న పేషంట్లు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అయితే సాధారణ జ్వరం,జలుబును చూసి కూడా ప్రజలు సీజనల్ ఫ్లూ, ఇన్ఫ్లుఎంజా, లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ కేసులా అని ప్రజలు భయపడుతూ ఆస్పత్రులకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తెలియని వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ప్రజలు జ్వరం, జలుబు, తలనొప్పి మరియు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.కాగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సకాలంలో వైద్యులను సంప్రదించకపోతే తీవ్రమైన న్యుమోనియా సహా శ్వాశకోశ సమస్యకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇండియన్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డేటా ప్రకారం…..గతేడాది కూడా హైదరాబాద్ నగరంలో ఇదే తరహాలో ఇన్ఫ్లుఎంజా ( H1N1), ( H3N2) కేసులు నమోదు అయ్యాయి. యశోదా ఆస్పత్రికి చెందిన జనరల్ ఫిజషన్ డాక్టర్ సోమనాథ్ కుమార్ మాట్లాడుతూ…….రోజు చూస్తున్న కేసుల్లో ఎక్కువ శాతం నీటి ద్వారా వచ్చే వ్యాధులే ఉన్నాయని ఆయన చెప్పారు. వాటితో పాటు చికెన్ పాక్స్, డిప్తేరియా, మీజిల్స్, వంటి కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. కాగా కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధులు ఎగువ, దిగువ శ్వాస నాళాలపై ప్రభావం చూపుతాయని వెల్లడించారు. అరుదైన సందర్భాల్లో ఈ వ్యాధులు ఊపిరితిత్తులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఇమునాలజిస్ట్ డాక్టర్ గీత దేవి మాట్లాడుతూ…..గత పది రోజులుగా ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ కేసులను మనం చూస్తున్నాం. కరోనా తరువాత ప్రజల్లో ఇమ్యూనొలాజికల్ మార్పుల తరువాత ఇప్పుడు సాధారణ ప్లూ కూడా ఇప్పుడు శ్వాస ఇన్ఫెక్షనలుగా మారుతుంది. ఈ పెరుగుదల న్యుమోనియా వ్యాధికి దారి తీస్తుందని ఆమె తెలిపారు.జ్వరం,జలుబు,దగ్గు,గొంతు నొప్పి,శరీరా నొప్పులు, కండ్లకలక, తుమ్ములు, ముక్కు దిబ్బడ, చాతీ నొప్పి, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు లేదా వ్యాధులు మూడు రోజులు కంటే ఎక్కువగా ఉన్నాయంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తులతో ఆహారం, నీరు, బట్టలు పంచుకోకపోవడం మంచిది. తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైతే హ్యాండ్ సానిటిజర్ వాడాలి. తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు మోచేతి అడ్డు పెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. మార్కెట్ లో ఫ్లూ శాట్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఏడాదికి ఒకసారైనా ఆ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్