- Advertisement -
పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలి
ఎన్విరాన్మెంట్ కౌన్సిల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్
హైదరాబాద్ జనవరి 29
మానవాళికి జీవ నాడి పర్యావరణమే అని, ఆ పర్యావరణాన్ని కాపాడుకొనే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం ఆయన “ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ” రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఏ వ్యవస్థ అయినా, ఏ తరం అయినా అభివృద్ధి జరగాలి అంటే ప్రకృతి కరుణ ఉండాల్సిందేనన్నారు. నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి హైదరాబాద్ విభాగం అధ్యక్షులు నర్సయ్య, కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



