- Advertisement -
మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గాన్నిఅనురించాలి
మహబూబ్ నగర్
పవిత్ర రంజాన్ లోని అంతరార్థం తెలుసుకుని ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డికె అరుణ. మహబూబ్ నగర్ లో ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం మైనారిటీ సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు… చిన్నారులు పెద్దలు ను ఆత్మీయంగా పలకరించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తాను గెలిచేలా ఆశీస్సులు అందించాలని అల్లా ను ప్రార్థించారు. ఈ వేడుకల్లో భాగంగా హిందువులు ముస్లిం మైనారిటీ సోదరులు పరస్పరం పండగ శుభకాంక్షలు చెప్పుకోవడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని ఆమె అన్నారు.
- Advertisement -