Thursday, January 15, 2026

ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్

- Advertisement -

ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్
ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి..విషమం 70మంది అస్వస్థత
హైదరాబాద్ జూన్ 4

Food poisoning at Erragadda psychiatric hospital

ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ మానసిక రోగి మృతిచెందిన సంఘటన ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. మరోముగ్గురు సతీష్ (33), కరుణ్ రెడ్డి (35), ఎల్లయ్య (43) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో ఉన్న రోగులు 70మందికి భోజనం చేసిన తర్వాత వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అందులో చికిత్స పొందుతూ కరుణ్ అనే మానసిక రోగి మృతిచెందగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, క్రిస్టినా జెడ్ చోంగ్తు, డిఎంహెచ్‌ఓ వెంకటి ఆస్పత్రిలో చికి త్స పొందుతు వారిని పరామర్శించారు.వైద్యులను ఆడిగి వారి ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మానసిక రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌ఎంఓ ఫిర్యా దు మేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన మానసిక రోగి గుండెపోటు(కార్డియాక్ అరెస్)తో చనిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఫుడ్ పాయిజన్ అయిన 35 మంది మానసిక రోగులు చికిత్స అందించామని, వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్