40 మంది పైగా విద్యార్థులకు అస్వస్థత
నాగర్ కర్నూల్ జిల్లా , అమ్రాబాద్ : మన్ననూర్ ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్… 40 మంది పైగా విద్యార్థులకు అస్వస్థత, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల ఎస్టీ బాలికల వసతి గృహంలో గురువారం సాయంత్రం హాస్టల్ విద్యార్థులు అస్వస్థకు గురైనారని స్థానికులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల ఎస్టీ బాలికల వసతి గృహంలో గురువారం సాయంత్రం హాస్టల్ విద్యార్థులు అస్వస్థకు గురైనారని స్థానికులు తెలిపారు. స్థానికులు విద్యార్థుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..రోజు మాదిరిగానే విద్యార్థులు గురువారం సాయంత్రం డిన్నర్ చేసిన తర్వాత 40 మందికి విద్యార్థులు శ్వాస ఆడక ఇబ్బంది పడుతుండటంతో తోటి విద్యార్థులు ఆటోలు , లారీలు , అంబులెన్స్.. సహకారంతో గ్రామంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి చేర్చి చికిత్స అందించే ప్రయత్నం చేశారు.




