Friday, January 17, 2025

హైదరాబాద్ కు విదేశీ పక్షిలు…

- Advertisement -

హైదరాబాద్ కు విదేశీ పక్షిలు…

Foreign birds to Hyderabad...

హైదరాబాద్, డిసెంబర్ 17, (వాయిస్ టుడే)
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని లేక్ సిటి  అంటారు. అడుగడుగునా చెరువులతో.. పుష్కలంగా నీళ్లతో కళకళలాడుతుంటుంది. ఇక్కడి వేలాది చెరువులు, కుంటల కారణంగానే.. ఓ వైపు నగర అవసరాలు, అనేక జీవ జాతుల మనుగడ సాధ్యమవుతోంది. కానీ.. విచ్చలవిడి చెరువుల విధ్వంసంతో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి మదిలో పురుడుపోసుకుని కార్యరూపం దాల్చిన హైడ్రా.. ప్రకృతికి ఓ వరంలా మారింది. ప్రకృతి పునరుజ్జీవానికి కీలక అడుగుగా మారగా.. వలస పక్షిల ఆనవాళ్లు తిరిగి హైదారాబాద్ చెరువుల్లో కనిపిస్తున్నాయి.హైదరాబాద్ చెరువులు విదేశీ పక్షిలు సహజ ఆవాసాలుగా ఉంటుండేవి. కానీ.. ఏళ్లుగా వాటి రాక మన చెరువుల్లో బాగా తగ్గిపోయింది. చెరువుల కబ్జా, మురుగు కాలువలు చెరువుల్లో కలవడంతో అవి రావడం మానేశాయి. కానీ.. ఇటీవల కొన్ని విదేశీ పక్షలు మన చెరువుల్లో కనువిందు చేస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.  దాంతో.. ఆయన ఆలోచనలకు, ప్రకృతికి చేసిన మంచి పనికి.. అనేక మంది పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు అభినందనలు తెలుపుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రముఖుల అలకల్ని లెక్కచేయకుండా.. సీఎం అనుసరించిన, అనుసరిస్తున్న విధానాలు.. పది కాలాల పాటు తెలంగాణ నేల గుర్తు పెట్టుకుంటుదని, వాటి ఫలితాలు తరాల పాటు ఇక్కడి ప్రజలకు అందుతాయంటూ ప్రశంసిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికతతో తెలంగాణ హరిత విప్లవానికి సరికొత్త నాంది పలికింది. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాల్ని అందిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక, పునరుత్పాదక ఇంధనం, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పునరుద్ధరణలో విప్లవాత్మక విధానాలు అనుసరిస్తూ తెలంగాణకు పచ్చని హారాన్ని తొడిగేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా స్థిరమైన భవిష్యత్తును అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా చేపట్టిన హైడ్రా ప్రాజెక్టు ద్వారా  75 సరస్సుల్లోని కబ్జాలపై ఉక్కుపాదం మోపి..వాటి పునరుద్ధరణకు వేగంగా చర్యలు చేపట్టారు. అదే బాటలో మరో 2,000 సరస్సుల్లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయితే.. నిర్జీవమైన నీటి వనరులను మళ్లీ పునరుజ్జీవం వస్తుందని అంటున్నారు. హైదరాబాద్ లో చెరువులు, కుంటలు అభివృద్ధి సాధిస్తే.. జీవవైవిధ్యం మెరుగవడంతో పాటు భూగర్భ జలాలను తిరిగి నింపడంలో కీలకంగా పనిచేస్తోంది. వలస పక్షులను తిరిగి తెలంగాణకు రావడం ఇందులో భాగమే అంటున్నారు. పునరుద్ధరణ పొందిన సరస్సులకు ఫ్లెమింగోలు, ఎర్ర ముక్కు ప్లైక్యాచర్ వంటి జాతులు.. ఇక్కడి చెరువుల్లో దర్శనమిస్తున్నాయి. అలా…హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ సరస్సులో అరుదైన ఎర్రటి ఫ్లైక్యాచర్‌లు కనిపించగా.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. కోటి మంది జనాభాతో నిత్యం లక్షల మంది రోడ్లపై ప్రయాణిస్తుంటారు. అందుకే.. వీరి ప్రయాణాన్ని పర్యావరణ అనుకూలంగా మలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభావంతమైన చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నగరంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మెట్రోను మిగతా నగరమంతటికీ అనుసంధానించడం ద్వారా వేగవంతమైన,  ప్రకృతి అనుకూల రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే.. వేలాది ఆర్టీసీ డీజిల్ బస్సుల్ని క్రమంగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెరగనున్న అవసరాలను తీర్చేందుకు విద్యుత్ బస్సుల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. ఈ కారణంగా.. రోజూ లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవ్వడంతో పాటు దాని నుంచి వచ్చే ఉద్గారాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ను మోడల్ గ్రీన్ సిటీగా మారేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో గ్రీనరీ పెంచేందుకు, కాలుష్య కారకాల్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలకు వేగంగా పచ్చజెండా ఊపుతున్నారు. ఇప్పటికే.. కాలుష్య కారకాలు విడుదల చేస్తాయని భావిస్తున్న ఫార్మా సంస్థల్ని సీటీకి దూరంగా ఏర్పాటు చేయడంతో పాటు అత్యాధునిక సాంకేతికతలు వినియోగించి.. వాటి నుంచి వచ్చే ఎలాంటి కాలుష్యాలు గాలిలోకి విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని గొలుసుకట్టు చెరువుల్ని పునరుద్ధరించడంతో పాటు వాటిలో కలిసే కాలుష్యాల్ని అరికట్టేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. జీరో వేస్టేజ్ హౌసింగ్ కాంప్లేక్స్ ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. ఈ స్థిరమైన ప్రాజెక్ట్‌లు పునరుత్పాదక శక్తి, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ సాంకేతికతలతో పని చేస్తాయని చెబుతున్నారు.తెలంగాణ ఎనర్జీ గ్రిడ్‌లో.. సోలార్ ప్లాంట్‌ల అనుసంధాన చేయడం ద్వారా కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే.. కాలుష్యానికి, మురుగుకు సంకేతంగా మారిన మూసిని ప్రక్షాళన చేయడమే కాక.. నది మొత్తాన్ని సుందరీకరించేందుకు నిర్ణయించడాన్ని రేవంత్ రెడ్డి దార్శనికతకు నిదర్శనంగా చెబుతున్నారు. పైగా.. మూసీ నదిలో బాపూ ఘాట్ ఏర్పాటు, గాంధీ యాత్రా స్థలా ఏర్పాటు ద్వారా పర్యావరణ. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనుకుంటోంది. దీని ద్వారా సుస్థిరతను, పర్యావరణ బాధ్యతతో సాంస్కృతిక వారసత్వాన్ని మిళితం చేయాలనే ఆలోచనను అభినందిస్తున్నారు. వాతావరణ సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చురుకైన విధానాలు తెలంగాణకు మాత్రమే వరం కాదు. దేశానికే ఆదర్శం అంటూ ప్రశంసిస్తున్నారు.. పర్యావరణ వేత్తలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్