పోడు రైతుల పంటను ధ్వంసం చేసిన ఆటవీ అధికారులు

- Advertisement -

పోడు రైతుల పంటను ధ్వంసం చేసిన ఆటవీ అధికారులు

Forest officials who destroyed the crops of poor farmers

ఆసిఫాబాద్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతుల పంటను ధ్వంసం చేశారు అటవీ అధికారులు.. కాగజ్నగర్ మండలం కడంబ గ్రామ సమీపంలోని అటవి ప్రాంతంలో గ్రామస్తులు పోడు వ్యవసాయం చేస్తుంటారు. గత రెండు సంవత్సరాలుగా రైతులను  పోడు వ్యవసాయం చేయకుండా అటవిశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అయినా ఈ సంవత్సరం కంది పంటను సాగు చేస్తుండగా అవి మొలకలెత్తడంతో ఈరోజు ఉదయం అటవీశాఖ అధికారులు మొక్కలను పీకడం ఉద్రిక్తత కు దారి తీసింది… రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది..తాము భారీగా నష్ట పోతున్నామని విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular