మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని.. కానీ, ప్రజా తీర్పును హుందాగా తీసుకొని రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆరోపణలు, విమర్శలు చేయకుండా ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేయబోతున్న పనులను చూసి నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. అతి త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహించుకొని.. ఫలితాలపై సమీక్ష చేసుకుందామని వెల్లడించారు. అదే సమావేశంలో శాసన సభ పక్ష నేతను కూడా ఎన్నుకుందామని అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తుల ఉమ, మల్లారెడ్డి, హరీష్ రావ్, కొత్త ప్రభాకర్ రెడ్డిm తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, కెటిఆర్, ఎమ్మెల్సీ రమణ తో పాటు మరి కొంత మంది ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు.

Former Chief Minister KCR meeting
Former Chief Minister KCR meeting
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular