గురుకులలా సందర్శనకు బయలు దేరిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అరెస్ట్
Former Choppadandi MLA Sunke Ravi Shankar arrested for visiting gurukulala
___ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుపాలని పోలీస్ లను నిలదీసిన సుంకె
చొప్పదండి
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని వివిధ గురుకుల పాఠశాలలో వసతులు విధ్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన కారులో శనివారం బయలు దేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను అరెస్ట్ చేసి రామడుగు మండల పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు
గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను పరిశీలించేందుకు బయలు దేరగా పోలీసులు చేసిన అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్టు తెలిపారు.గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని అయిన విమర్శించారు.11 నెలల్లో 52 మంది విద్యార్థులు మరణించారని…ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని తెలిపారు. పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పొట్టన బెట్టుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని… ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని సుంకె రవిశంకర్ దుయ్యబట్టారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అన్ని రకాల గురుకుల విద్యాసంస్థలు కలిపి 291 ఉంటే వాటిల్లో కేవలం 1లక్ష 54 వేల మంది చెదివేవారున్నారని
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో స్వరాష్ట్రంలో 1022 గురుకులం ఏర్పాటు చేసుకుని 6 లక్షల10 వేల 810 మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య, భోజనం అందిచడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా అన్ని గురుకులాలను కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకొని,కేవలం గిరిజన గురుకులాలు గతంలో 91 మాత్రమే ఉంటే అదనంగా మరో 97 గురుకులను ఏర్పాటు చేసుకుని 91,370 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేసింది అని చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగాయని . గురుకులాల్లో సీట్ల పొందడం కోసం విద్యార్థులు పోటీ పడేవారని పేర్కొన్నారు.ఎలా ఉండే విద్యావ్యవస్థ ఎలా తయారు అయిందని ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పించారు.