మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత..!
Former Health Minister Alla Nani passes away!
ఏలూరు జిల్లా, సెప్టెంబర్ 15 (వాయిస్ టుడే): మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఏలూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆళ్ల నాని రాజకీయ జీవితంలో కీలక పదవులు చేపట్టారు. తొలుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.




