మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్

- Advertisement -

మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
కరీంనగర్

Former Minister Gangula Kamalakar Placed Under House Arrest
కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరులు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో నేడు కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.  ఈ బంద్లో పాల్గొనకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా గంగుల కమలాకర్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించారు.  అదే సమయంలో పలువురు నాయకులు, కార్పొరేటర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో గంగుల వాగ్వాదనికి దిగడంతో పోలీసులు అయన ను అరెస్టు చేసి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular