- Advertisement -
మాజీ మంత్రి హరీష్‌రావు కష్టాలు
Former minister Harish Rao's difficulties
హైదరాబాద్, డిసెంబర్ 4, (వాయిస్ టుడే)
బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. లేటెస్ట్‌గా మాజీ మంత్రి హరీష్‌రావు కష్టాలు మొదలయ్యాయి. ఆయనపై పంజాగుట్టు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బాచుపల్లికి చెందిన చక్రదర్‌గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వేధింపులు మాత్రమే కాకుండా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించాడు. దీంతో హరీశ్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. అధికారం పోయిన తర్వాత నేతలు పార్టీ నుంచి వెళ్లిపోవడం, కేడర్ కలిసి రాకపోవడంతో కష్టాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం నేరుగా హరీష్‌రావు మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ బీఆర్ఎస్ నేతల బాగోతాలు బయటపడుతున్నాయి. ఇదే కేసులో పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు హరీష్‌రావుపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంకా చక్రధర్ గౌడ్ లాంటి బాధితులు ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సివుంది.రాధాకిషన్‌రావు , హరీష్‌రావులపై అనేకసార్లు ఫిర్యాదు చేశారు చక్రధర్. గతంలో రైతులకు సంబంధించిన విషయంలో తాను చెక్ లు ఇచ్చానని, వారికి ఆదుకున్నానని గుర్తు చేశారాయన. ఆ సమయంలో తాను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడమేకాకుండా కేసులు పెట్టి జైలుకి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.ఫోన్ ట్యాపింగ్ చేసి నా కదలికలను ఎప్పటికప్పుడు రాధాకిషన్‌రావు గుర్తించి హరీష్‌రావుకు సమాచారం ఇచ్చేవారని అందులో పేర్కొన్నారు. హరీష్‌రావు వల్లే తాను సర్వం కోల్పోయాలని బయటపెట్టాడు. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ.. నా ఫోన్ టాపింగ్ చేశారన్న ఫిర్యాదుతో హరీష్ రావుపై కేసు నమోదు అయ్యింది. సిద్దిపేటలో వార్ రూమ్ ఏర్పాటు చేసి రాధాకిషన్ రావు, భుజంగ రావు, ప్రణీత్ రావు నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు నా ఫోన్ టాపింగ్ చేయించాడు. తనకు రాజకీయంగా అడ్డు వస్తున్నానని నాపై కక్ష పెంచుకున్నాడు. హరీష్ రావుకు నేను ఎప్పుడు భయపడడలేదు. హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఫోన్ ట్యాప్ విషయంపై 2023 నుంచి ఇప్పటిదాకా కొట్లాడుతున్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూయించిన మెయిల్ నాకు వచ్చింది. ఫోన్ ట్యాప్ అయ్యింది అని డిజిపికి వినతిపత్రం ఇచ్చాను. న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లాను.నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నా మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. నన్ను రాధాకిషన్ రావు చంపుతా అని బెదిరించాడు. హరీష్ రావు చిన్నపిల్లగాడు కాదు. ఎన్నో కుటుంబాలను, వ్యాపారస్తులను వారి పాలనలో లొంగదీసుకున్నారు. నా మీద ఆరు కేసులు నమోదయ్యాయి. నా యాపిల్ ఫోన్ నుండి ఫోన్ ట్యాప్ అయినట్లు మెసేజ్ వచ్చింది. హరీష్ రావు సంవత్సరం పాటు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. నా భార్య, తల్లితో ఫోన్లో మాట్లాడింది అంతా రికార్డ్ చేశారు. నా డ్రైవర్‌తో మాట్లాడింది కూడా రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ అరెస్టులు జరిగాయి. మాజీ మంత్రి హరీష్ పీఏ హోంగార్డ్ జాబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఆడియోను నేనే లిక్ చేశాను. ఫోన్ ట్యాప్ కేసులో నేను కోర్టుకెళ్లాను. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు, వాళ్లు ముందుకు రావాలి. ఫోన్ ట్యాప్ కేసులో బాధితులు చాలా కీలకం. నన్ను ఇబ్బందులు పెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మన్నారు. నేను బీఎస్పీ నుంచి ఎన్నోకల్లో పోటీ చేసిన సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉందని డీజీపీకి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. హరీష్ రావు సుద్దపూస కాదు. ఆయన చేసిన స్కాంలు అన్ని బయటపెడుతా. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుంటే నిజాలు బయటకు వస్తాయి. బీఆర్ఎస్ వల్లే తెలంగాణ 3 తరాలు వెనక్కి పోయింది. కమీషన్ల కోసం హరీష్ రావు కమిట్మెంట్ ఇస్తాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హరీష్ రావు ఓడిపోవడం ఖాయమన్నారు’ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్.ఈ అంశంలో చక్రధర్ నుంచి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు జైలులో ఉండగా, రేపో మాపో హరీష్‌రావు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
- Advertisement -


