- Advertisement -
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడి.
తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని జనసేన నాయకులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెద్దిరెడ్డి ఇంటికి మున్సిపాలిటీ నిధులతో రోడ్డు వేశారని ఆరోపిస్తూ జనసేన నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు పెద్దిరెడ్డి ఇంటి వైపు వెళ్లకుండా జనసేన నేతలను అడ్డుకున్నారు. మున్సిపాలిటీ అధికారులు రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
- Advertisement -