Wednesday, January 22, 2025

మందమర్రిలో ఘనంగా మాజీ ప్రధాని  ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలు

- Advertisement -

మందమర్రిలో ఘనంగా మాజీ ప్రధాని  ఇందిరా గాంధీ 107వ జయంతి వేడుకలు

Former Prime Minister Indira Gandhi's 107th birth anniversary celebrations

మందమర్రి,

మందమర్రి పట్టణంలో చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఘనంగా భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోతుకు సుదర్శన్ లు మాట్లాడుతూ ఇందిరా గాంధీ చిన్నతనం నుండి  స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని అప్పుడే ఆమె ఒక వానరసేనను ఏర్పాటు చేయడం జరిగిందని, గాంధీజీతో పాటు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఇందిరా గాంధీ  ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో పేద ప్రజలు ఉండద్దనే ఉద్దేశంతో గరీబ్ హఠావో అనే నినాదంతో పేద ప్రజల్లోకి వెళ్లి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి  ఇల్లు లేని వారికి ఇల్లు ఇంకా అనేక పథకాలను పేద ప్రజలకు అందించడం జరిగిందని అలాగే బ్యాంకులను జాతీయం చేయడం జరిగిందని అన్నారు.  రాబోయే రోజుల్లో సోనియా గాంధీ,రాహుల్ గాంధీ  నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని తెలిపారు.  ప్రతి ఒక్కరూ ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరు లక్ష్మణ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి జమీల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆఫీస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర  కార్యదర్శి మహంత్ అర్జున్, చెన్నూరు యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వడ్లూరి సునీల్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు ఎండి సుకూర్, బూడిద శంకర్ సేవాదల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, మంకు రమేష్ జమాల్ పూరి నరసోజి ఎర్ర రాజు కడలి శ్రీనివాస్ దుర్గం ప్రభాకర్ రాయబారం కిరణ్ తుంగ పిండి విజయ్ రాచర్ల రవి అందుగుల లక్ష్మణ్ ఆకారం రమేష్ సట్ల సంతోష్  వీరు ఎండి జావిద్ సజ్జు శ్రీనివాస్ సుద్దాల రాజ్ కుమార్ సతీష్  సోతుకు ఉదయ్ శ్రీనివాస్ జీవన్ కొలిపాక సదానందం పారుపల్లి శివరామకృష్ణ రాచర్ల గణేష్ రాజేష్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్