- Advertisement -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు
Former Prime Minister Manmohan Singh's death is a great loss for the country
ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి నేతలు పూలమాలవేసి నివాళులు అర్పించారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎటువంటి సమస్య లేకుండా 10 సం.ల పాటునడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ అని ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసిం వలి, విద్యార్థి విభాగం. ఎన్ ఎస్ యు ఐ.జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప కూడలిలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మౌనం పాటించారు . ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి రాగా… అవి నేటికీ ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. *దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ చట్టం మొదట ఆ పథకాన్ని ప్రారంభించింది అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలోనే ఆ పథకం అమలు పరిచి 10 సం.లు అయిన మరల మన్మోహన్ సింగ్ , రాహుల్ గాంధీ , సోనియా గాంధీ అనంతపురం జిల్లాకు 2016 లో విచ్చేశారు అని గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆయనకు ఉన్న అనుబంధం ఈ ఆర్థిక దిగ్గజానికి ఇవియే మా కన్నీటి నివాళ్ళు అని ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఫిక్ భాష,ఆన్సర్,హర్ష, విష్ణు,దురంథ్, అజయ్, సోమిరెడ్డి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -