- Advertisement -
*ఉపాధి పేరుతో మోసం.. కంబోడియాలో కష్టాలు*
*ఇక్కడ కనిపిస్తున్న యువకుడు తెలంగాణకు చెందిన మున్సిఫ్ ప్రకాశ్.*
మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన ప్రకాశ్ విదేశాల్లో ఉపాధి కోసం 3 నెలల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించాడు.
ఏజెన్సీ వాళ్లు ఆస్ట్రేలియా అని చెప్పి బ్యాంకాక్‌కు.. అక్కడి నుంచి కంబోడియా తీసుకెళ్లారు.
అక్కడ మూడు రోజులకు ఒకపూట తిండి పెడుతూ.. మత్తు ఇంజెక్షన్లు వేసే వారని, బెల్టుతో కొడుతూ.. షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని బాధితుడు సెల్ఫీ వీడియోల ద్వారా తెలిపాడు.
రెండు రోజుల క్రితం ప్రకాశ్‌ను కంబోడియా పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
- Advertisement -