Sunday, September 8, 2024

తిరుమలలో ఉచిత బస్సు చోరీ ..

- Advertisement -

తిరుమలలో ఉచిత బస్సు(ధర్మరథం) చోరీకి గురైంది.. శ్రీవారి సాలకట్ల‌ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆదివారం తెల్లవారు జామున తిరుమలలోని టిటిడి డిపోలో ఉంచిన ఉచిత బస్సు (ధర్మరధం)ను ఎత్తుకెళ్ళారు.. అయితే తెల్లవారు జామున తిరుమల జీఎన్సీ టోల్ గేట్ మీదుగా తిరుపతికి వస్తున్న జీఎన్సీ టోల్ గేట్ లోని టిటిడి విజిలెన్స్ సిబ్బంది బస్సును నిలపక పోవడం సిబ్బంది నిర్లక్ష్యంకు ఉదాహరణగా నిలుస్తొంది.. ఉదయం నుండి ఉచిత బస్సు టిటిడి డిపోలో లేక పోవడంతో తిరుమలలోని అన్ని ప్రాంతాలను సిబ్బంది తనికీ చేసి, బస్సు చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చి తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీనిపై కేసు నమోదు చేసి‌ పోలీసులు జీపిఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు.. ఉచిత బస్సు తిరుపతి జిల్లా, నాయుడుపేట వద్ద బస్సు ఉన్నట్లు క్రైం పోలీసులు సమాచారం అందుకుని బస్సులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. గత పాలక మండలి చైర్మన్ గా ఉన్న వైవీ.సుబ్బారెడ్డి తిరుమలలో పర్యావరణ పరిరక్షించేందుకు రెండో దశలో మొత్తం పది ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చారు.. అయితే ఒక్క ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు దాదాపు రెండు కోట్ల రూపాయలు వరకూ ఉంటుంది.. సబ్సిడీతో కేవలం నలభై లక్షలకే టిటిడి బస్సులను కొనుగోలు చేసింది.. అయితే ఉచిత బస్సు చోరీపై భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు.. కేవలం టిటిడి విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బస్సు చోరీకి గురి అయ్యింది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Free bus theft in Tirumala
Free bus theft in Tirumala
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్