రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్తాపక అద్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్
హైదరాబాద్ డిసెంబర్ 22
సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయించాలని గో. ఆధారిత వ్యవసాయం రైతులతో చేయించాలంటే రైతుల వద్ద పశువులు లేకపోవడంతో గోశాలల ఉన్న ఆవులను రైతులకు అందించాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్తాపక అద్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ కోరారు. ఆవులు కూడా గోశాలలో ఉన్న ఆవులు ఎంతో అవస్థ పాలు అవుతున్నాయి వాటికి సరైన ఆహారం కానీ వాతావరణము లేక ఇరుకు ప్రదేశాల్లో ఉంటూ బక్క చిక్కిపోతున్నాయని, అలాంటి ఆవులను రైతులకు ఇస్తే ఆవు సుఖపడుతుందన్నారు. ఆవు ప్రాముఖ్యత తెలిసిన రైతు తప్పక ఆవును పోషిస్తూ వ్యవసాయానికి ఉపయోగపడేలా వాటి పేడ మూత్రాలతో జీవామృతం తయారుచేసి భూమిలో వేసి సేంద్రియ పద్ధతిలో అమృత పంటలు పండించి సమాజాన్ని ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దగాలదన్నారు.ఈ సదుద్దేశం తో రైతు సంక్షేమ సేవా సంఘం పశువుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే రైతు సంక్షేమ సేవా సంఘం ద్వారా రైతులకు ఉచితంగా 96 ఆవులను పంపిణీ చేయడం జరిగిందని ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. ముందు ముందు కూడా భారీ సంఖ్యలో ఆవులను సేకరించిఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.కొత్త సంవత్సరం జనవరి నెల కూడా 200 ఆవులను రైతులకు ఇవ్వడానికి రైతు సంఘం సిద్ధం చేస్తున్నట్లు ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు.
గోఆధారిత వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా 96 ఆవుల పంపిణీ
- Advertisement -
- Advertisement -