- Advertisement -
యాదవ సంఘ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం…
Free medical camp for Yadava community members...
కమాన్ పూర్
కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామ యాదవ సంఘం సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని యాదవసంఘ నాయకులు ప్రారంభించారు. ఈ శిభిరంలో 150 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు చేశారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ… యాదవ సంఘ సభ్యులకు, స్థానిక ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహించామని అన్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా నిరంతర సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు బోసు తిరుపతి, జై కొమురయ్య, మాదాసి శివ, బి సాయి శంకర్, ఎం రవీందర్, జి జగన్, కే తిరుపతి, మాదాసి రాజకుమార్, కటికి రెడ్డి హరీష్, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, బొంగోని హారీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -