Sunday, September 8, 2024

పేదలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం

- Advertisement -

తెలంగాణలో బీసీ రాజ్యం వస్తోంది: ప్రధాని మోడీ

హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామివారిని స్మరించుకున్నారు. నా కుటుంబసభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగించిన మోదీ.. ‘మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యాను.. మీ ఆశీర్వాదంతోనే త్వరలో బీజేపీ బీసీ వ్యక్తి సీఎం అవుతారు’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభకు వచ్చిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీపైనే విశ్వాసంతో ఉన్నారన్న ఆయన.. అన్నివర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
*నా కుటుంబ సభ్యులారా..నా బీసీ ఆత్మ గౌరవ సోదరులారా అని తెలుగులో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజల నమ్మకం బీజేపీ నే. *అభివృధ్ది, బీసీ విరోది ప్రభుత్వాన్ని పడగొట్టల్సిన అవసరం ఉంది. *తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు..కానీ తెలంగాణా వచ్చాక వ్ర ప్రభుత్వం బీసీ ప్రజలను మోసం చేసింది. బీఆర్ఎస్  కి బీ టీమ్ కాంగ్రెస్. ఎన్డీయే   బీజేపీ ఇది.. అబ్ధుల్ కలాంని రాష్ట్రపతి ని చేసింది..బాలయోగి ని స్పీకర్ని చేసింది..రామ్ నాథ్ కోవిద్ ని రాష్ట్రపతిని చేసింది బీజేపీ నే. *మొదటిసారి బీసీ ముక్యమంత్రి ని బీజేపీ ప్రకటించింది. *తెలంగాణాలో కుడా బీసీ రాజ్యం వస్తుందని అన్నారు.

Free rice for the poor for five years
Free rice for the poor for five years

తెలంగాణ అభివృద్ధి విరోధి, బీసీ విరోధి, ఎస్సీ, ఎస్టీ విరోధిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ మూడింటి విషయంలో బీఆర్ఎస్ మోసం చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు. స్వరాష్ట్రంలో బీసీలను మోసం చేశారు. బీసీల ఆకాంక్షలను కేసీఆర్ సర్కార్ ఏనాడూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ సీ టీమ్ అని.. కాంగ్రెస్ బీఆర్ఎస్ సీ టీమ్ అని ఆరోపించారు. రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని చెప్పారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్షణాలని ఆక్షేపించారు.
బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందని ప్రధాని మండిపడ్డారు. అవినీతి సర్కారును ఇంటికి పంపడం తథ్యమన్నారు. ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలన్నారు. తెలంగాణ యువతను కేసీఆర్ సర్కారు మోసం చేసిందన్న మోదీ.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ.. యువత జీవితాలను దుర్భరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను ఇంటికి పంపాలా.. వద్దా? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించగా.. ముక్తకంఠంతో పంపించాలంటూ నినదించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే పేదలకు ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తామని.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని సుస్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్