20 నుండి కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ప్రారంభం

- Advertisement -

20 నుండి కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ప్రారంభం

From 20, identification survey of leprosy patients will be started

మద్దికేర
జాతీయ కుష్టు నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ఈనెల 20 నుండి  ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆశ మరియు ఆరోగ్య కార్యకర్తల ద్వారా నిర్వహించనున్నట్లు ప్రాథమిక ఆరోగ్య

వైద్యాధికారిణి డాక్టర్ రాగిణి శనివారం రోజున తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ మరియు ఆరోగ్య కార్యకర్తలకు శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శిక్షణ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక

ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ రాగిణి మాట్లాడుతూ చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కనురెప్పలపై వెంట్రుకలు రాలిపోవడం, అరచేతులు అరికాళ్ళలో స్పర్శ లేకపోవడం వంటివి కుష్టు అనుమానిత

లక్షణాలని దీనిని ముందుగానే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభించే మందులను వాడడం వల్ల వ్యాధిని నయం చేయవచ్చని అన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతినెల మూడవ

శనివారం నిర్వహించినట్లు ఇందులో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలచే ప్రతిజ్ఞ నిర్వహించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,మలేరియా

సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశులు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,లెప్రసీ నోడల్ ఆఫీసర్ కృష్ణమ్మ,ఆరోగ్య పర్యవేక్షకులు సూర్యనారాయణ,హెల్త్ సెక్రటరీలు అంజలి,గాయత్రి,లక్ష్మి,సువర్ణ,పద్మ, మాబున్నీ మరియు ఆశా

కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular