Sunday, September 8, 2024

జూలై 1 నుంచి  పింఛన్‌ రూ. 4వేలు

- Advertisement -

జూలై 1 నుంచి  పింఛన్‌ రూ. 4వేలు

– ఏప్రిల్‌, మే, జూన్‌ నెల బకాయిలతో కలిపి రూ.7వేలు

– రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4400 కోట్లు మంజూరు

– జిల్లాలో 319961 మంది లబ్ధిదారులకు రూ. 218.87 కోట్లు మంజూరు

– పింఛన్ల పంపిణీకి వాలంటీర్లనును వినియోగించడం లేదు

– గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు

– తిరుమల నుంచే రాష్ట్రంలోని ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం

– ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు రూ.5వేల నుంచి రూ.10వేల పెంపునకు ప్రతిపాదన

– రాష్ట్ర దేవాదాయ,ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు, జూన్‌ 27 :
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇందులో భాగంగా జూలై నెల 1వ తేదీ నుంచి రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ఎన్టీఆర్‌ భరోసా పింఛను మొత్తం అందించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం నగరంలోని సంతపేటలో గల క్యాంపు కార్యాలయంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో ఇస్తున్న 3వేల ఫించన్‌కు రూ.వెయ్యి పెంచి జులై ఒకటో తేదీ నుంచి రూ. 4 వేలు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీకి అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్‌ మొత్తం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల బకాయిలతో కలిపి జూలై 1న రూ.7వేలు పింఛన్‌ అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం రూ. 2700 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం ఈ నెలలో రూ. 4400 కోట్లు రెట్టింపు మొత్తాన్ని  పింఛన్లకు మంజూరు చేసిందన్నారు.  పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను వినియోగించడం లేదని,  గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.  అధికారం చేపట్టిన మొదటి నెలలోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీ పింఛన్ల పెంపు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుదేన్నారు. జిల్లాలో 319961 మంది లబ్ధిదారులకు రూ. 218.87 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు.  దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్‌ ను రూ. 3 వేల నుంచి రూ.6 వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్‌ ను రూ.15 వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కిడ్నీ, లివర్‌, బైలేట్రల్‌ ఎలిఫెంటాసిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్‌ ను రూ.5 వేల నుంచి రూ.10 వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్